Petrol Price Today: స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు

Update: 2019-10-03 04:08 GMT

పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని రోజులుగా పైపైకి దూసుకుపోతున్నాయి. అయితే, గురువారం పెట్రోల్ ధరలు దిగివచ్చాయి. బుధవారం తో పోలిస్తే గురువారం పెట్రోల్ ధర 11 పైసలు తగ్గింది.దీంతో హైదరాబాద్ లో పెట్రోల్ ధర 79.14 రూపాయలకు దిగింది. ఇక డీజిల్ ధర 7 పైసలు తగ్గడంతో 73.44 రూపాయలైంది. అదేవిధంగా అమరావతిలో పెట్రోల్ ధర 10 పైసలు తగ్గి 78.80 రూపాయలు గానూ, డీజిల్ ధర 7 పైసలు తగ్గడంతో 72.76 రూపాయలకు చేరింది. విజయవాడలోనూ పెట్రోల్ ధర 11 పైసలు తగ్గింది. దీంతో 78.43 రూపాయలకు చేరింది. ఇక డీజిల్ ధర కూడా 7 పైసలు తగ్గడంతో 72.42రూపాయలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ ధరలు తగ్గాయి. పెట్రోల్ పై 10 పైసలు, డీజిల్ పై 7 పైసలు ధర తగ్గడంతో ముంబయిలో పెట్రోల్ ధర 80.11 రూపాయలు, డీజిల్ 70.69 రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ పై 10 పైసలు, డీజిల్ పై 6 పైసలు ధర తగ్గడంతో పెట్రోల్ ధర 74.51 రూపాయలుగానూ, డీజిల్ ధర 67.43 రూపాయలుగానూ ఉంది.


Tags:    

Similar News