Gold Price Crash : పసిడి జోరుకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
పసిడి జోరుకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Price Crash : పసిడి ప్రేమికులకు ఊరట లభించింది. గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాలతో దేశీయంగా పసిడి ధరలు భారీగా దిగొచ్చాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ తరుణంలో బంగారం, వెండి ధరలు తగ్గడం సామాన్యులకు పెద్ద ఊరటనిస్తోంది. నిన్నటితో పోలిస్తే నేడు ధరలు ఎంత తగ్గాయో, తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
నేడు (ఫిబ్రవరి 19, 2026) దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధర మాత్రం భారీగా పతనమైంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.1,54,190 వద్ద ఉండగా.. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,340 వద్ద కొనసాగుతోంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫిబ్రవరి 16, 17 తేదీల్లో బంగారం ధర తులంపై సుమారు రూ.3,250 వరకు తగ్గింది. ఆ భారీ తగ్గుదల తర్వాత నేడు ధరలు నిలకడగా ఉన్నాయి.
మరోవైపు వెండి ధరలు మాత్రం కొనుగోలుదారులకు షాక్ ఇస్తూ భారీగా పతనమయ్యాయి. కేవలం ఒక్క రోజులోనే కేజీ వెండి ధర రూ.5,000 తగ్గి ప్రస్తుతం రూ.2,59,900 వద్ద ఉంది. గత పది రోజుల్లో వెండి ధరలు అస్సలు పెరగకపోగా.. ఫిబ్రవరి 13 నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.40 వేల వరకు తగ్గడం గమనార్హం. వెండి కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన సమయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
నగరాల వారీగా 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి
* హైదరాబాద్: రూ. 1,54,190
* ఢిల్లీ: రూ. 1,54,340
* చెన్నై: రూ. 1,55,230
* ముంబై: రూ. 1,54,190
* బెంగళూరు: రూ. 1,54,190
ఇక్కడ పేర్కొన్న ధరలు ఉదయం 8 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం ఉన్నవి. దీనికి అదనంగా జీఎస్టీ, హాల్ మార్కింగ్, మేకింగ్ ఛార్జీలు ఉంటాయి. ప్రాంతాలను బట్టి, నగరాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.