Gold Rates Today 25.10.2019: స్వల్పంగా పెరిగిన బంగారం..భారీ షాక్ ఇచ్చిన వెండి!

బంగారం ధర శుక్రవారం 25.10.2019 స్వల్పంగా పెరిగింది. అయితే, వెండి ధర మాత్రం భారీ షాక్ ఇచ్చింది.

Update: 2019-10-25 01:04 GMT

బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. 25.10.2019 శుక్రవారం పది గ్రాముల బంగారం ధర గురువారం తో పోలిస్తే 10 రూపాయల వరకూ పెరిగింది. కాగా, నిన్న దిగివచ్చినట్టు కనిపించిన  వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి..

శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో  24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 10 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల ధర 39,970 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 10 రూపాయలు పైకెగసింది. ఈపెరుగుదలతో 36,640 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక గురువారం తగ్గినట్లు కనిపినిపించిన  వెండి ధర శుక్రవారం భారీగా కేజీకి 670  రూపాయలు పెరుగుదల  నమోదు చేసింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 48,770 రూపాయలకు ఎగసింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,970 , 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,640 రూపాయలుగానూ ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  స్థిరరంగా ఉంది. దీంతో 38,600 రూపాయల వద్ద 24 క్యారెట్ల బంగారం ధర నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా నిలకడగా 37,400 రూపాయల వద్ద వుంది. ఇక వెండి ధర ఇక్కడ కూడా కేజీకి 670  రూపాయలు పెరిగింది. దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 48,770 రూపాయలు వద్ద నిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 25.10.2019 శుక్రవారం  7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.


Tags:    

Similar News