Gold Rates Today 24.10.2019: పైకెగసిన బంగారం..దిగొచ్చిన వెండి!

Update: 2019-10-24 01:39 GMT

బంగారం ధరలు గురువారం కొద్దిగా పైకెగశాయి.24.10.2019 గురువారం పది గ్రాముల బంగారం ధర బుధవారం తో పోలిస్తే 160 రూపాయల వరకూ పెరిగింది. కాగా, నిన్న అమాంతం పైకెగసిన వెండి ధరలు మాత్రం దిగొచ్చాయి.

గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 160 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల ధర 39,960 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 160 రూపాయలు పైకెగసింది. ఈపెరుగుదలతో 36,630 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక బుధవారం పైచూపులు చూసిన వెండి ధర గురువారం కేజీకి 400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 48,100 రూపాయలకు దిగివచ్చింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,960 , 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,630 రూపాయలుగానూ ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్ లో కూడా పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు పైకెగసింది. దీంతో 38,600 రూపాయల వద్దకు 24 క్యారెట్ల బంగారం ధర చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 150 రూపాయలు పెరగడంతో 37,400 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక వెండి ధర ఇక్కడ కూడా కేజీకి 400 రూపాయలు తగ్గింది. దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 48,100 రూపాయలు వద్ద నిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 24.10.2019 గురువారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News