రాజకీయాలకు గుడ్‌బై‌: వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

Update: 2025-01-24 13:18 GMT

విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టుగా ఆయన ప్రకటించారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని ఆయన వివరించారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని ఆయన వివరించారు.



ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఆయన పోస్టు పెట్టారు. పదవులు, డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదన్నారు. తాను భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని ఆయన తెలిపారు.రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కు తనను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన వైఎస్ భారతికి ధన్యవాదాలు చెప్పారు.జగన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నారన్నారు. పార్లమెంటు పార్టీ నాయకుడిగా , రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా జాతీయ నాయకుడిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News