Lifestyle: యువతలో పెరుగుతోన్న అలసట.? ఎలా బయటపడాలంటే..
ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే కనిపించే అలసట ప్రస్తుతం యువతలోనూ ఎక్కువవుతోంది.
యువతలో పెరుగుతోన్న అలసట.? ఎలా బయటపడాలంటే..
ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే కనిపించే అలసట ప్రస్తుతం యువతలోనూ ఎక్కువవుతోంది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు నిత్యం అలసటతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారు. ఇంతకీ యువతలో ఈ సమస్య ఎందుకు పెరుగుతోంది.? ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం.
ఉద్యోగపరమైన ఒత్తిడి, చదువుల టెన్షన్, విపరీతమైన సోషల్ మీడియా వినియోగం, స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్‌ల వినియోగం పెరిగింది. దీంతో నిద్రలేమి సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇది యువతలో అలసటకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. ఇక తీసుకునే ఆహారంలో మార్పులు కూడా అలసటకు కారణమవుతున్నాయని నిపుణులు అంటున్నారు.
ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్‌ను తీసుకోవడం, వేళకు భోజనం చేయకపోవటం వల్ల శరీరానికి రోజంతా అవసరమయ్యే శక్తి అందడం లేదు. ఇక ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు చాలా మందికి ఎండ తగలడం లేదు. దీంతో శరీరానికి సరిపడు విటమిన్ డీ లభించడం లేదు. ఇవన్నీ అలసటకు దారి తీస్తున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది.
ఇలా చెక్ పెట్టండి
రిపడు నిద్రతో పాటు వేళకు భోజనం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. శరీరం ఎప్పుడూ డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి.ఒంట్లో నీటి శాతం కొద్దిగా తగ్గినా అలసటకు దారితీయొచ్చు. తగినంత నీరు తాగితే అలసటకు అడ్డుకట్ట వేయవచ్చు.
సాధాణంగా శారీరక శ్రమ ఉంటేనే అలసిపోతుంటాం అని అనుకుంటాం. నిజానికి శారీరక శ్రమ తక్కువైనా అలసట వేధిస్తుంటుంది. అందుకే కచ్చితంగా వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోవాలి. కచ్చితంగా ప్రతీ 2 రెండు గంటలకు ఒకసారి లేచి కాసేపు నడవాలి.
రోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. మానసిక ఆరోగ్యం మెరుగు పరిచేందుకు యోగా, మెడిటేషన్ వంటి వాటిని కచ్చితంగా అలవాటు చేసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా తీసుకునే ఆహారంలో మార్పులు సైతం చేసుకోవాలి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. నూనెలు, కొవ్వులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.