YV Subba Reddy: పెద్దల సభలోనూ టీడీపీ ఖాళీ చేశాం

YV Subba Reddy: సాధారణ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయి

Update: 2024-02-21 12:45 GMT

YV Subba Reddy: పెద్దల సభలోనూ టీడీపీ ఖాళీ చేశాం

YV Subba Reddy: అసెంబ్లీ, లోక్ సభల్లో ఖాళీ అయిన టీడీపీని.. ఇక పెద్దల సభలోనూ ఖాళీ చేశామన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి. సీఎం జగన్ ఆశీస్సులతో వైసీపీ అభ్యర్దులుగా రాజ్యసభ బరిలో నిలిచిన తాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యామన్నారు. సంఖ్యా బలం లేకపోయిన ప్రతిపక్ష టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్ధిని బరిలో నిలిపేందుకు ప్రయత్నం చేసిందన్నారు.

అయినా శాసనసభ్యుల మద్దతుగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే విజయం కొనసాగుతుందని వైవీ సుబ్బారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ, కాంగ్రెస్ పెడుతున్న ప్రలోభాలకు పార్టీ మారిన వాళ్లంతా తిరిగి వైసీపీలోకి వస్తారని.. ప్రజా బలం ముందు ప్రలోభాలు పని చేయవన్నారాయన.

Tags:    

Similar News