నేడు ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న షర్మిల

YS Sharmila: నేడు విజయవాడలో స్వీకరించనున్న పదవీ బాధ్యతలు

Update: 2024-01-21 03:03 GMT

నేడు ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న షర్మిల

YS Sharmila: ఏపీ పీసీసీ చీఫ్ గా ఎన్నికైన వైఎస్ షర్మిల నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. గత నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలను.. మూడు రోజుల క్రితమే ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఎంపిక చేస్తూ.. హైకమాండ్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం విజయవాడలో వైఎస్ షర్మిల పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఉదయం 10 గంటలకు విజయవాడకు చేరుకోనున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బాధ్యతలు చేపట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జులు, ఏఐసీసీ సభ్యులు, కో- ఆర్డీనేటర్లు హాజరుకానున్నారు. వీళ్లందరి సమక్షంలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం అధ్యక్షురాలి హోదాలో తొలిసారి ఆంధ్రరత్న భవన్ లోని కార్యాలయానికి వెళ్లనున్నారు.

Tags:    

Similar News