YS Sharmila: వైఎస్ ఫ్యామిలీ చీలిపోవడానికి జగనే కారణం

YS Sharmila: వైఎస్‌ కుటుంబాన్ని కాంగ్రెస్ విడగొట్టిందన్న వ్యాఖ్యలపై కౌంటర్

Update: 2024-01-25 08:50 GMT

YS Sharmila: వైఎస్ ఫ్యామిలీ చీలిపోవడానికి జగనే కారణం

YS Sharmila: కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని విడగొట్టి రాజకీయాలు చేస్తోందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన జగనన్న.. వైఎస్సార్ కుటుంబం చీలిపోవడానికి ఆయనే కారణమన్నారు షర్మిల.

అందుకు సాక్ష్యం తన తల్లి విజయమ్మనే అన్నారు. జగన్‌మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే.. 18 మంది రాజీనామాలు చేసి జగన్ అన్న వైపు నిలబడితే అధికారంలో వచ్చాక మంత్రులను చేస్తానని చెప్పారని అన్నారు. ఇవాళ వాళ్లలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారని ప్రశ్నించారు. వైసీపీ కష్టాల్లో ఉందని తనను పాదయాత్ర చేయమని చెప్తే.. ఇంటిని, పిల్లలకు పక్కన పెట్టి ఎండనక, వాననక రోడ్ల మీదనే ఉన్నానని తెలిపారు షర్మిల.

Tags:    

Similar News