ఇవాళ గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష
* హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు
ఇవాళ గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష
CM Jagan: ఇవాళ ఉదయం 11 గంటలకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు హాజరుకానున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతున్న తీరుపై సమీక్ష చేయనున్నారు సీఎం. ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వే చేయిస్తున్న సీఎం జగన్ కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఈ సమీక్షలో సదరు ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్ పీకే అవకాశం ఉన్నట్టు సమాచారం.