గృహప్రవేశం :వారికి స్వయంగా ఆహ్వాన పత్రికలు పంపిన జగన్..

Update: 2019-02-27 01:44 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి నేడు (బుధవారం) ఉదయం గృహప్రవేశం చేయనున్నారు. ఆ తరువాత వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పార్టీ ఆఫీస్ లో సర్వమత ప్రార్థనలు జరుగుతాయని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. బుధవారం ఉదయాన్నే వైఎస్‌ జగన్‌ సతీసమేతంగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడ్నుంచి నేరుగా తాడేపల్లి వెళ్తారు.

కాగా, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఈ కార్యక్రమానికి ఉదయం పది గంటలకల్లా హాజరై, ఆతిథ్యం స్వీకరించాలని వైయస్ జగన్ వారందరికీ ఆహ్వాన పత్రికలు పంపినట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీకి రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్‌, దగ్గుబాటి సహా పలువురు కీలకనేతలు ఇవాళ వైసీపీ కండువా కప్పుకోనున్నారు.

Similar News