Perni Nani: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై వైసీపీ అభ్యంతరం
Perni Nani: కౌంటింగ్ ప్రక్రియ సమయంలో గొడవ జరిగే ఛాన్స్
Perni Nani: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై వైసీపీ అభ్యంతరం
Perni Nani: ఎన్నికల కౌంటింగ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల కౌంటింగ్ మీద ఈసీ తాజాగా ఇచ్చిన సడలింపుపై అభ్యంతరం తెలిపింది. ఏపీ అదనపు సీఈవోను కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఫామ్ 13ఏలో ఓటరు, ఆర్వో సంతకం, బ్యాలెట్ సీరియల్ నంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చని ఇటీవల ఈసీ మార్గదర్శకాలు జారీచేసింది. పోస్టల్ బ్యాలెట్ మీద ఆర్వో సంతకం పెట్టి స్టాంప్ వేయాలని గతంలో చెప్పారన్న పేర్నినాని.. ఇప్పుడేమో స్టాంప్ వేయకపోయినా సరే ఆమోదించాలని అంటున్నారని తెలిపారు.