గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి
*శ్రీశైలంలో పలు కాలనీల్లో పర్యటించి సంక్షేమ పథకాలపై ఆరా
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి
Silpa Chakrapani Reddy: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శ్రీశైలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించారు. మహిషాసురమర్దిని అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.. ఎస్సీ కాలనీలో పర్యటించి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీగిరి కాలనీలో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి భూమిపూజ చేశారు.