YCP: నరసరావుపేట ఎంపీ సీటుపై వైసీపీ అధిష్టానం ఫోకస్
YCP: నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
YCP: నరసరావుపేట ఎంపీ సీటుపై వైసీపీ అధిష్టానం ఫోకస్
YCP: నరసరావుపేట ఎంపీ సీటుపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. లావు శ్రీకృష్ణదేవరాయులును గుంటూరుకు వెళ్లమని హైకమాండ్ ఆదేశిస్తోంది. అయితే.. తాను నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని లావు.. అధిష్టానానికి చెప్పినట్టు సమాచారం. అటు.. లావు శ్రీకృష్ణదేవరాయులునే బరిలో ఉంచాలని పల్నాడు ఎమ్మెల్యేలు సైతం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు రావాలని పల్నాడు ఎమ్మెల్యేలందరికీ సీఎంవో నుంచి పిలుపు వెళ్లింది. ఈ నేపథ్యంలో క్యాంప్ ఆఫీస్‌కు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. నరసరావుపేట ఎంపీ స్థానంపై కాసేపట్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.