పల్నాడులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యేకి యరపతినేని వార్నింగ్

హత్య కేసులో ముద్దాయిగా ఉన్నావంటూ వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2021-01-06 10:59 GMT

గుంటూరు జిల్లా పల్నాడులో రాజకీయలు హీటెక్కుతున్నాయి. గురజాల నియోజకవర్గంలోని పెదగార్లపాడు టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులు హత్య అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటలు పెలుతున్నాయి. హత్య రాజకీయాలను ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి ప్రొత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ఆరోపణలను వైసీపీ ఎమ్మెల్యే తిప్పికొట్టారు. హత్యారాజకీయలు కేరాఫ్ ఆడ్రాస్ యరపతినేనే అని విమర్శించారు.

గతంలో యరపతినేని శ్రీనివాస్ పిడుగురాళ్లలో నరేంద్ర హత్య కేసులో ముద్దాయిగా ఉన్న విషయాన్ని కాసు ప్రస్తావించి హీట్ పెంచారు. నరేంద్ర హత్య కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తి తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అంకులు ఎవరో తనకు తెలియదని.. అయినా ఆయన్ను చంపితే తమకేం వస్తుందని వ్యాఖ్యానించారు. పి వంగవీటి రంగాను చంపిన చరిత్ర చంద్రబాబుదంటూ ప్రతిపక్ష నేతపైనా మాటల తూటాలు వదిలారు. కాసు మహేష్ వ్యాఖ్యలపై యరపతినేని మరోసారి విరుచుకుపడ్డారు. హత్య జరిగి 3 రోజులైనా కేసులో ఎలాంటి పురోగతి లేదని.. పోలీసులే సహకరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.

అలాగే నరసరావుపేట రాజకీయాలు పల్నాడులో చేస్తామంటే కుదరదని ఎమ్మెల్యే మహేష్‌కి తీవ్ర హెచ్చరికలు చేశారు. హత్యా రాజకీయాలను సాగనివ్వబోమని కౌంటరిచ్చారు. హత్య కేసు ఎఫ్‌ఐఆర్‌లో దాచేపల్లి ఎస్సై బాలనాగిరెడ్డి పేరు కూడా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయ పోరాటం చేస్తామని యరపతినేని స్పష్టం చేశారు. టీడీపీ నేత అంకులు హత్య తర్వాత నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య విమర్శలు ఇప్పట్లో ఆగేలా లేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


Tags:    

Similar News