హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం.. స్విగ్గీ పై నిషేధం..

Update: 2019-11-06 14:57 GMT

స్విగ్టీ, జొమాటో లాంటి ఫుడ్ ఆర్డరింగ్ యాప్స్ మండల కేంద్రాలకు సైతం విస్తరిస్తుంటే మరో వైపున వాటిని బ్యాన్ చేసేందుకు ఒక్కో నగరంలో హోటల్స్ సంఘటితమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఇలానే జరిగింది. వచ్చే సోమవారం నుంచి విజయవాడలో స్విగ్గీని బ్యాన్ చేయనున్నట్లు విజయవాడ హోటల్ అసోసియేషన్ ప్రకటించింది.

విజయవాడలో 16 నెలల క్రితం ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటో లాంటివి తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. మొదట ఇవి హోటళ్ళకు ఉచితంగా సేవలందించాయి. ఆ తరువాత 5 శాతం, 10 శాతం కమిషన్ తీసుకున్నాయి. ఇప్పుడు 25 శాతం దాకా కమీషన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. కాల్ చార్జీలు, ఆర్డర్ క్యాన్సిల్ ఛార్జీలను హోటళ్ళ మీదనే రుద్దుతున్నాయి. దీంతో మొదటగా స్విగ్గీని నిషేధిస్తూ విజయవాడ హోటల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. తగిన స్పందన రాకపోతే జొమాటో, ఊబర్ ఈట్స్ ను కూడా బ్యాన్ చేస్తామంటోంది. 

Tags:    

Similar News