Pawan Kalyan: పిఠాపురంలో అభివృద్ధి పరుగులు.. పవన్ ఇలాకాలో ఉపాసన ప్రాజెక్ట్

పిఠాపురంలో అపోలో సంస్థల తరపున ఓ సేవా కార్యక్రమం చేయడానికి ఉపాసన ముందుకొచ్చారు. తాజాగా దానికి సంబంధించి వివరాలు ప్రకటించారు. ఉపాసన తాతయ్య, అపోలో అధినేత డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి బర్త్ డే సందర్భంగా మదర్ హుడ్ అనే ప్రోగ్రాంని మొదలు పెట్టబోతున్నారు.

Update: 2025-02-05 12:14 GMT

పిఠాపురంలో అభివృద్ధి పరుగులు.. పవన్ ఇలాకాలో ఉపాసన ప్రాజెక్ట్

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన తమ అపోలో సంస్థల తరపున ఓ సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు. ఇంతకీ అది ఎక్కడో కాదు తన మామ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో. పిఠాపురంలో పవన్ ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు పవన్‌కి తోడుగా మెగా కోడలు ఉపాసన కూడా అభివృద్ధిలో భాగం కాబోతున్నారు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులతో పాటు పిఠాపురం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఉపాసన చేయబోయే సేవా కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం.

పిఠాపురంలో అపోలో సంస్థల తరపున ఓ సేవా కార్యక్రమం చేయడానికి ఉపాసన ముందుకొచ్చారు. తాజాగా దానికి సంబంధించి వివరాలు ప్రకటించారు. ఉపాసన తాతయ్య, అపోలో అధినేత డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి బర్త్ డే సందర్భంగా మదర్ హుడ్ అనే ప్రోగ్రాంని మొదలు పెట్టబోతున్నారు. అపోలో మెడికల్ కాలేజీ, అపోలో ఫౌండేషన్ కలిసి పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ సెంటర్‌ని ప్రారంభిస్తున్నారు. తల్లులకు, పుట్టిన పిల్లలకు మంచి ఆరోగ్యం, న్యూట్రీషియన్ ఫుడ్ అందించమే ఈ కార్యక్రమం కర్తవ్యం. అంతేకాదు. అక్కడి మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం కోసం నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. తల్లి సంరక్షణ, మహిళా సాధికారత మీద అక్కడి వారికి అవగాహన కల్పించనున్నారు.

ప్రాథమిక దశలో పిఠాపురంలో మొదలు పెట్టి ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా 109 అంగన్వాడీ కేంద్రాలను పునరుద్దించనున్నారు. ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్‌తో పాటు పిఠాపురం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురంలో తన అపోలో సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమంటూ ప్రశంసిస్తున్నారు.



 


Tags:    

Similar News