Nuzvid: కరోనా వైరస్ నేపథ్యంలో రవాణా శాఖ సేవలు నిలిపివేత

స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో... రవాణాశాఖ కొన్ని నిర్ణయాలు తీసుకున్నది.

Update: 2020-03-20 16:19 GMT

నూజివీడు: స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో... రవాణాశాఖ కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. ఈ నెల 21 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకూ ఎల్.ఎల్.ఆర్, డ్రైవింగ్ లైసెన్సు లు కొరకు బుక్ చేసుకున్న స్లాట్ లు నిలిపివేసినట్టు అధికారులు ప్రకటించారు. అదేవిధంగా 3 టైర్ ఆఫ్ లైన్ సేవలను కూడా ఏప్రిల్5 వరకూ నిలిపివేశారు.

ఏప్రిల్ 1వ తేదీన తిరిగి స్లాట్ లు పునరుద్దించబడునని... నూజివీడు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కే.ఆర్. రవికుమార్ రవాణా శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. కావున నూజివీడు, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల ప్రజలు గమనించాలని రవాణా శాఖ యూనిట్ కార్యాలయం అధికారి తెలిపారు.


Tags:    

Similar News