Tirumala: తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక

Tirumala: తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ విలువైన బంగారు కానుకలను సమర్పించింది.

Update: 2025-07-29 05:29 GMT

Tirumala: తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక

Tirumala: తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ విలువైన బంగారు కానుకలను సమర్పించింది. ఈ సంస్థ 2.5 కిలోల బంగారంతో రూపొందించిన శంకు, చక్రాలను శ్రీవారికి భక్తిశ్రద్ధలతో అర్పించింది. వీటి విలువ సుమారు రూ.2.4 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ శంకు, చక్రాలను తిరుమలలోని శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలో తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరికి దాతలు హస్తాంతరం చేశారు. తిరుమల శ్రీవారికి వినూత్నంగా చేసిన ఈ బంగారు కానుక భక్తులలో ప్రత్యేక ఆసక్తిని రేపుతోంది.

Tags:    

Similar News