Madanapalle Child Murder Case Update: మదనపల్లె ఘటనలో ట్విస్ట్.. చిన్నారిని పొట్టనబెట్టుకున్న నిందితుడు చెరువులో శవమై ప్రత్యక్షం!
Madanapalle Child Murder Case Update: మదనపల్లె చిన్నారి హత్యాచారం కేసులో సంచలనం. నిందితుడు కులవర్ధన్ మృతదేహం చెరువులో లభ్యం. అసలు ఏం జరిగింది? హత్య లేదా ఆత్మహత్యా? పూర్తి వివరాలు.
Madanapalle Child Murder Case Update: మదనపల్లె ఘటనలో ట్విస్ట్.. చిన్నారిని పొట్టనబెట్టుకున్న నిందితుడు చెరువులో శవమై ప్రత్యక్షం!
Madanapalle Child Murder Case Update: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ (30) మృతి చెందాడు. కురబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో బుధవారం ఉదయం నిందితుడి మృతదేహం తేలడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగింది?
మదనపల్లె పట్టణానికి చెందిన రెండో తరగతి చదువుతున్న బాలిక సోమవారం సాయంత్రం ఆడుకుంటూ అదృశ్యమైంది. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో గాలింపు చేపట్టిన పోలీసులకు, ఎదురింట్లో ఉండే కులవర్ధన్‌పై అనుమానం కలిగింది. మంగళవారం ఉదయం అతడి ఇంటి తలుపులు బద్దలుకొట్టి చూడగా, ఓ వాటర్ డ్రమ్ములో చిన్నారి మృతదేహం విగతజీవిగా కనిపించింది. ఈ దారుణం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు.
చెరువులో మృతదేహం:
నిందితుడి కోసం గాలిస్తున్న క్రమంలో, కనసానివారిపల్లె చెరువులో ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, అది చిన్నారిని హత్య చేసిన కులవర్ధన్‌దేనని నిర్ధారించారు. పోలీసులు అతడిని వెంబడించడంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని అన్యాయంగా చంపిన నిందితుడు ఇలా శవమై తేలడంపై స్థానికంగా చర్చ నడుస్తోంది.