AP 10th Class Hall Ticket 2026: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. హాల్‌టికెట్లు విడుదల తేదీ ఇదేనా?

ఏపీ పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం. హాల్‌టికెట్లు మార్చి మొదటి వారంలో విడుదల. వివరాల్లో తప్పులు ఉంటే సవరణకు అవకాశం.

Update: 2026-02-18 11:09 GMT

AP 10th Class Hall Ticket 2026: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. హాల్‌టికెట్లు విడుదల తేదీ ఇదేనా?

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలకు సమయం దగ్గరపడుతోంది. మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హాల్‌టికెట్ల విడుదలపై విద్యాశాఖ ముఖ్య నిర్ణయం తీసుకుంది.

అధికారుల సమాచారం ప్రకారం, హాల్‌టికెట్లను మార్చి మొదటి వారంలో విడుదల చేయనున్నారు. విద్యార్థులు అధికారిక విద్యాశాఖ జాలస్థలం ద్వారా హాల్‌టికెట్లు పొందే సౌకర్యం కల్పించనున్నారు. హాల్‌టికెట్లలో ఇంటిపేరు, పుట్టిన తేదీ తదితర వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సవరించుకునే అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు.

వివరాల సవరణపై విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరీక్షలు పూర్తైన తర్వాత మార్కుల జాబితా విడుదల సమయంలో కూడా మార్పులు చేసుకునే వీలు ఉంటుందని తెలిపారు.

పరీక్షలు మార్చి 16 నుంచి మార్చి 30 వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. అనంతరం ఏప్రిల్ 4 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమై దాదాపు పది రోజుల పాటు కొనసాగనుందని విద్యాశాఖ వెల్లడించింది.

Tags:    

Similar News