Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్.. కస్టడీ పిటిషన్ కొట్టేసిన కోర్టు!
Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది.
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్.. కస్టడీ పిటిషన్ కొట్టేసిన కోర్టు!
Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. సత్తెనపల్లి లక్కీ డ్రా కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు గుంటూరు జిల్లా కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.
అంబటి రాంబాబును విచారించేందుకు తమకు కస్టడీకి అప్పగించాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను జడ్జి కొట్టివేశారు. ఈ కేసులో కస్టడీ అవసరం లేదని అభిప్రాయపడిన న్యాయస్థానం, పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చింది. మరోవైపు అంబటి తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సత్తెనపల్లిలో అక్రమంగా లక్కీ డ్రా నిర్వహించారనే ఆరోపణలతో అరెస్టయిన అంబటి రాంబాబు, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు అందగానే, అధికారిక ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.