Kudair: స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశందే గెలుపు
స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీల గెలుపు తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతుందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
కూడేరు: స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీల గెలుపు తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతుందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. నామినేషన్లు పత్రాలు దాఖలు చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ను కలిశారు.
గత ఎన్నికల్లో అన్ని చోట్ల తెదేపా గెలవలేకపోయినా.. ఉరవకొండ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించి చరిత్రను తిరగరాశారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో తెదేపాదే గెలుపు ఖాయం అని ఆయన నాయకులు, కార్యకర్తలతో అన్నారు.