'మంచి సీఎం కాదు ముంచే సీఎం' పుస్తకావిష్కరణ చేసిన యనమల

Update: 2019-11-30 13:50 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాలనపై రాసిన పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు విడుదల చేశారు. ఈ పుస్తకానికి 'మంచి సీఎం కాదు జనాన్ని ముంచే సీఎం' అని పేరును కూడా పెట్టారు. ఈ పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విజయవాడలో విడుదల చేశారు.

ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా యనమల మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పడినప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో తగ్గిన ఆదాయం లేదని ఇదే ఈ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ఆర్ధిక లావాదేవీలు చిన్నాభిన్నం అయ్యాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

తెలుగు దేశం ప్రభుత్వ పాలనలో ఆదాయం పెరిగినప్పుడే ఖర్చులు పెరిగాయని, ఇప్పుడు ఆదాయం పూర్తిగా పడిపోయిందని ఆయనన్నారు. ఇంతే కాక ప్రస్తుత పరిస్థితుల్లో రూ.83వేల కోట్ల ఆదాయం వస్తుందని జగన్ ప్రభుత్వం బడ్జెట్ పెడితే అది రూ.21కోట్ల ఆదాయం బడ్జెట్ లో తగ్గనుందని వివరించారు.

ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలోనూ అవినీతే జరగుతుందని యనమల తెలిపారు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్ర ప్రజలు చాలా కష్టాలను ఎదర్కోవలసి వస్తుందని ఆయన తెలిపారు. అవినీతి కేసుల్లో, కుంభకోణం కేసులో కోర్టు మెట్లెక్కే సీఎం జగన్ అవినీతిని అరికడతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన తెలిపారు. ఏదేమైనా ఈ ప్రభుత్వం పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.




Tags:    

Similar News