వైసీపీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు: వంగలపూడి అనిత

రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సృష్టిస్తున్నదని, ఇప్పుడు పాయకరావుపేట నియోజకవర్గానికి కూడా పాకింది అంటూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.

Update: 2020-03-13 12:28 GMT
Vangalapudi Anitha

ఎస్.రాయవరం: రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సృష్టిస్తున్నదని, ఇప్పుడు పాయకరావుపేట నియోజకవర్గానికి కూడా పాకింది అంటూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం మద్యాహ్నం అడ్డురోడ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... నక్కపల్లి మండలంలోని వైసీపీ నాయకుల బెదిరింపులకు బయపడి కేవలం తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ అయ్యే పరిస్థితి వరకు ఒక పంచాయతీ సెక్రెటరీ తీసుకు వచ్చారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అన్నారు.

డొంకడ ఎంపీటీసీకు తెలుగుదేశం పార్టీ తరుపున నామినేషన్ దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. కేవలం ఇంటి పన్ను చెల్లించలేదంటూ చిన్న కారణంగా తిరస్కరించారు. అయితే ఇంటి పన్ను చెల్లించడానికి సెక్రటరికి పలు మారులు ఫోన్ చెయ్యగా ఆయన తప్పించుకుని తిరిగిరాని ఆరోపించారు.

ఎమ్మెల్యే, ఎంపీడీఓ, ఇఓఆర్డీ, నాయకులు నుండి వత్తిడి వస్తుందని అందుకే చెయ్యలేక పోయాను అంటూ సెక్రెటరీ తెలిపిన ఆడియో రికార్డులను విలేకరులకు వినిపించారు. అధికారులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదు అని ప్రశ్నించారు. ఇంటిపన్ను బకాయిలు విషయంలో పూర్తి బాధ్యత సెక్రటరీదే అని అన్నారు. అంతే కాకుండా నక్ఖపల్లి ఇఓఆర్డీ గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య కోటవురట్ల లో వైసీపీ తరుపున ఎంపీటీసీ అబ్యర్దిగా పోటీ చేస్తున్నారు.

అంటే ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు అని ఆమె ప్రశ్నించారు. ఒక్క డొంకడా గ్రామంలోనే నలుగురు అభ్యర్ధుల నామినేషన్ పత్రాలను ఒకే రీజన్ తో రిజెక్ట్ చేశారు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో మీరే అర్ధం చేసుకోండి అని పేర్కొన్నారు. అధికారులు వాళ్ళ విధులను సక్రమంగా నిర్వహిస్తే మేము కూడా రాజకీయ నాయకులు లాగా నడుచుకుంటామని హెచ్చరించారు. లేకపోతే మేము ఎక్కడ వరకు అయినా వెళ్తామని ఈ సందర్భంగా ఆమె అన్నారు. వైసీపీ వాళ్ళు మాత్రం నిబంధనలు పాటించ కుండా ఎన్నికల కోడ్ కూడా ఉల్లంఘనకు పాల్పడుతున్నారు అంటూ ఆమె దుయ్యబట్టారు.


Tags:    

Similar News