చంద్రబాబునాయుడు చేపట్టిన అమరావతి టూర్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాబు పర్యటనకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య వెంకటపాలెంలో ఘర్షణ జరిగింది. చంద్రబాబు కాన్వాయ్‌ని చూడగానే ఓ వర్గం వారు ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై చెప్పులు, రాళ్లు రువ్వారు. పోటాపోటీగా నినాదాలు చేశారు. బాబు కాన్వాయ్ వైపు దూసుకెళ్లేందుకు ఓ వర్గం రైతులు విఫలయత్నం చేయడంతో, పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టి, కాన్వాయ్ కి దారి కల్పించారు. బాబు పర్యటన ఓ వైపు స్వాగతం, మరోవైపు నిరసనల మధ్య సాగుతోంది.