మహిళా క్రికెటర్ శ్రీచరణికి భారీ నగదు ప్రోత్సాహకం

మహిళా క్రికెటర్ శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నగదు ప్రోత్సాహకంగా రూ.2.5 కోట్ల చెక్ ను రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ అందజేశారు.

Update: 2025-12-17 10:13 GMT

అమరావతి: మహిళా క్రికెటర్ శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నగదు ప్రోత్సాహకంగా రూ.2.5 కోట్ల చెక్ ను రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ అందజేశారు. మహిళల వన్డే ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం ప్రకటించిన  నగదు ప్రోత్సాహకాన్ని ఉండవల్లి నివాసంలో అందజేశాను. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని శ్రీచరణిని అభినందించారు. క్రీడల్లో మహిళలు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వం ఎల్లప్పుడూ క్రీడాకారులకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు, ఎండి భరణి, స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ పాల్గొన్నారు.

కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన మంత్రి అనితకు కృతజ్ఞతలు

యువగళం పాదయాత్రలో కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చానని, కానిస్టేబుల్ పోస్టుల భర్తీని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తన హామీని నెరవేర్చేందుకు కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియను ఒక యజ్ఞంలా చేపట్టి పూర్తి చేసిన హోం మంత్రి వంగలపూడి అనితకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్టుల భర్తీని అడ్డుకునేందుకు వేసిన కుట్రపూరిత కేసులను అత్యంత చాకచక్యంగా పరిష్కరించడం వెనుక అధికార యంత్రాంగానికి హోం మంత్రి పూర్తి సహాయ, సహకారాలు అందించారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన హోం మంత్రికి, అధికార, పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News