విజయవాడ నుంచి హజ్ వెళ్లే వారికి రూ.లక్ష సాయం

విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుండి పవిత్రమైన మక్కా హజ్ యాత్ర కు వెళ్లే ప్రయాణికులకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందచేస్తున్న ఆర్థిక చేయూతను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కోరారు.

Update: 2025-12-17 11:04 GMT

అమరావతి: విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుండి పవిత్రమైన మక్కా హజ్ యాత్ర కు వెళ్లే ప్రయాణికులకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందచేస్తున్న ఆర్థిక చేయూతను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కోరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి హజ్ కు వెళ్లే వారందరికీ రూ. లక్ష ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అమరావతి లో బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి వెల్లడించారు. ఆదాయంతో నిమిత్తం లేకుండా విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్లే యాత్రికులందరికీ మైనారిటీ సంక్షేమ శాఖ రూ.లక్ష సాయం అందిస్తుందన్నారు.

ఇతర రాష్ట్రాల ఎంబార్కేషన్ కేంద్రాల నుండి వెళ్లే యాత్రికుల విమాన చార్జీల కంటే ఎక్కువ మొత్తం విజయవాడ నుంచి వెళ్లే వారిపై పడుతున్న భారం తగ్గించేందుకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. గన్నవరం విమానాశ్రయం పరిసర జిల్లాల యాత్రికుల సౌకర్యార్థం, ఏపీ రాజధానిగా అమరావతి ప్రాముఖ్యతను మరింత పెంచేందుకు, విజయవాడ నుండి హజ్ కి వెళ్లే యాత్రికులందరికీ ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రం నుండి హజ్ కి వెళ్లే వారంతా విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఎంచుకుని కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంను సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News