Maddelapalem: ఆకట్టుకున్న సదరన్‌ పుడ్ ఫెస్ట్

విశాఖ నగరం ఇసుక తోట ప్రాంతంలో సదరన్‌ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్‌మెంట్ అకాడమీ ఆధ్వర్యంలో సదరన్ పుడ్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Update: 2020-03-04 08:42 GMT

మద్దిలపాలెం: విశాఖ నగరం ఇసుక తోట ప్రాంతంలో సదరన్‌ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్‌మెంట్ అకాడమీ ఆధ్వర్యంలో సదరన్ పుడ్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు వివిధ దేశాల వంటకాలను తయారు చేసి నోరూరించారు.

ఇటాలియన్, మెక్సికన్, అరబిక్, ఫ్రెంచ్ దేశాల సంప్రదాయ వంటకాలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనకు హోటల్ మేనేజ్‌మెంట్ ఎండీ సతీశ్ పొన్నం, ఎంవీపీ ఎస్సై భాస్కర్ రావు పాల్గొన్నారు.


Tags:    

Similar News