ఏపీలో సోమవారం నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు!

సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. కరోనా కారణంగా ఇప్పటివరకూ కోల్పోయిన విద్యా సంవత్సరాన్ని కవర్ చేసుకునేలా సిలబస్ కు రూపకల్పన చేసినట్లు వెల్లడించారు.

Update: 2020-10-31 14:20 GMT

సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. కరోనా కారణంగా ఇప్పటివరకూ కోల్పోయిన విద్యా సంవత్సరాన్ని కవర్ చేసుకునేలా సిలబస్ కు రూపకల్పన చేసినట్లు వెల్లడించారు. కేంద్ర గైడ్ లైన్స్‎ను పాటిస్తూ పాఠశాలలను తెరుస్తున్నామన్న మంత్రి.. సోమవారం నుంచి 9,10 క్లాసులతో పాటు ఇంటర్ సెకండియర్ తరగతులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. నవంబర్ 16 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు, నవంబర్ 23 నుంచి 6,7,8 తరగతులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్కూళ్లలో శానిటైజేషన్ జాగ్రత్తలు తీసుకుంటున్నామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన పనిలేదన్నారు.

Tags:    

Similar News