Sankranti Celebrations: సంక్రాంతి సంబరాల సందడి మొదలు.. ఏపీ అంతటా మూడు రోజుల పండుగ హంగామా

Sankranti Celebrations: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ సంబరంగా ప్రారంభమైంది. గొబ్బిళ్లు, ముత్యాల ముగ్గులు, భోగి మంటలు, పిండి వంటలు, కోడి పందాలు, గాలిపటాల పోటీలు.. మూడు రోజుల పాటు ఏపీ ప్రజలు ఉత్సాహంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు.

Update: 2026-01-12 09:15 GMT

Sankranti Celebrations: సంక్రాంతి సంబరాల సందడి మొదలు.. ఏపీ అంతటా మూడు రోజుల పండుగ హంగామా

Sankranti Celebrations:  సంక్రాంతి... ఈ పేరు వినగానే ఓ ఉత్సాహం, ఉల్లాసం వస్తాయి... మూడు రోజుల పండుగలో ప్రజలు ఆనందంలో మునిగి తేలుతారు... ఇక సంక్రాంతి సంబరాలు చూడాలి అంటే ఆంధ్రప్రదేశ్ వెళ్ళవల్సిందే... ఏపీలో సంక్రాంతి ఓ రేంజ్ లో జరుగుతుంది అనటంలో సందేహం లేదు... అందుకే ఇప్పుడు అన్నీ దారులు ఏపీ వైపు చూస్తున్నాయి...

అది ఓ సంబురాల పండుగ... ఇక సందడే సందడి...ఎటు చూసినా హడావిడి...ఏ వీధికి వెళ్లిnaa పిండి వంటల వాసనలే... బంధువులు వస్తారు... ఇక ఉల్లాసం, ఉత్సాహం వెళ్లి విరుస్తుంది... ఒకటి రెండు కాదు... మూడు రోజుల పండుగ మరి... అదే సంక్రాంతి ప్రత్యేకత...

ఏపీలో మొదలైన సంక్రాంతి సందడి

నెల రోజుల ముందే ఇంటి ముందు గొబ్బిల్లు పెట్టే సంప్రదాయం

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందడి మొదలైంది. నెల రోజులు ముందు నుంచే గొబ్బిల్లు పెట్టే సంప్రదాయం ఏపీలో ఉంది. బొమ్మల కొలువులు, భోగి మంటలు, భోగి పండ్ల పేరంటాలు...ఇలా సంక్రాంతి సందడి శోభకు అంతు లేదు.


పండుగల్లో అన్నీ పండుగలు ఒక ఎత్తైతే...సంక్రాంతి పండుగ మరో ఎత్తు. మూడ్రోజుల పాటు ముత్యాల ముగ్గులు, గొబ్బిల్లు, భోగి పండ్ల పేరంటాలతో మహిళలు ఇంట్లో బిజీబిజీగా గడుపుతారు. మరోవైపు గాలి పటాలు, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో యువత తేలి ఆడతారు.

సంక్రాంతి సందర్భంగా గోదావరి, కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలో కోడి పందాలు అంబరానంటే...స్థాయిలో జరుగుతాయి. కోడి పందాలకు అనుమతి లేదని పోలీసులు అంటున్నా...ఇప్పటికే కోడి పందాల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. సంక్రాంతి వేడుకల్లో కోడి పందాలు ఓ సంప్రదాయంగా ఏపీ ప్రజలు చెప్పుకుంటారు. ఈ కోడి పందాలు చూసేందుకు, పందెం కాసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తారు. ఇందుకోసం ఇప్పటికే గోదావరి జిల్లాలోని లాడ్జ్‌లు ఫుల్ అయ్యాయంటే..కోడి పందాలకు ఉన్న క్రేజ్‌ అర్థం చేసుకోవచ్చు.

సంక్రాంతి అంటే పిండి వంటల పండుగ. అందులో అరెసెలు సంక్రాంతి స్పెషల్. ఏపీలో చేసే అరిసెలకు ఈ సీజన్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇక చక్రాలు, పొంగలి నువ్వు, వేరుశెనగ ఉండలతో పాటు రకరకాల స్వీట్లు తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు సంక్రాంతికి మాత్రం ఏపీలోని తమ సొంత ఊర్లు చేరుకోవటం పరిపాటి. ఒక్క హైదరాబాద్ నుంచే 10నుంచి 15 లక్షల మంది సంక్రాంతి పండుగను ఆంధ్రప్రదేశ్‌లోని తమ సొంత ఊర్లో జరుపుకోవటానికి తరలివచ్చారు.

రాయలసీమలో ఎద్దుల పందాలు, పోటేళ్ల పందాలు జోరుగా సాగుతాయి. భోగి మంటతో మొదలై...కనుమతో ముగిసే సంక్రాంతికి మరో విశేషం కూడా ఉంది. అదే సంక్రాంతి ధన, ధన్యాలతో తాము సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తారు. కనుమ రోజు పశువులకు పూజలు చేసి వాటికి ఇష్టమైన ఆహారం అందిస్తారు.


Tags:    

Similar News