పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం అందజేత

పట్టణంలో నగర పంచాయతీ కార్యాలయం ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది.

Update: 2020-04-21 05:44 GMT

గొల్లప్రోలు: పట్టణంలో నగర పంచాయతీ కార్యాలయం ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. పట్టణ వాస్తవ్యుడు రైస్ మిల్ యజమాని ముత్తింటి వెంకటేశ్వర రావు ధన సహాయంతో పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం సమకూర్చారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో కూడా వారు చేస్తున్న సేవలను గుర్తించి బియ్యం పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయమని, వారి సేవలను మరువలేనివని అభినందించారు.పట్టణంలో 70మంది పారిశుద్ధ్య కార్మికులకు 15కిలోల బియ్యం అందించినట్లు దాత ముత్తింటి వెంకటేశ్వర రావు తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమీషనర్ సాయిబాబు, మేనేజర్ జయకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు.

Tags:    

Similar News