Eluru: వేలేరుపాడులో ‘ఎర్ర’దండు.. కూటమి సర్కార్‌కు సిపిఐ హెచ్చరిక!
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడులో సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఎన్నికల హామీలు నెరవేర్చాలి అని డిమాండ్ చేస్తూ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేత.
Eluru: వేలేరుపాడులో ‘ఎర్ర’దండు.. కూటమి సర్కార్‌కు సిపిఐ హెచ్చరిక!
ఏలూరు జిల్లా: వేలేరుపాడు మండలం, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వేలేరుపాడు నుండి స్థానిక తహసిల్దార్ కార్యాలయం వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అన్ని ప్రాంతాలలో ర్యాలీ కార్యక్రమం చేపడుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పించన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయిలు ఇవ్వాలని, పెంచిన గ్యాస్, పెట్రోల్., డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని, ఉపాధి హామి పథకానికి నాలుగు లక్షల కోట్లు నిధులు విడుదల చేయాలని, అర్హులైన ప్రతీ పేదవాడికి ఇంటి స్థలం, ఇల్లు తక్షణమే మంజూరు చేయాలని,ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని,పెద్దవాగు ప్రాజెక్టు నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్స్ లో పేర్కొన్నారు. ర్యాలీ అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు కారం దారయ్య , జిల్లా కార్యవర్గ సభ్యులు పిట్టా ప్రసాద్, మండల కార్యదర్శి బాడిశ రాము, నాయకులు బంధం నాగేశ్వరావు, మడివి కామయ్య, పిట్టా వీరయ్య, కరటం వెంకటేశ్వర్లు, బుడిబుటి జానుబాబు, బంధం రమాదేవి, మడకం విజయ్, గడుపుల భీమరాజు, కాకా ముత్యాలరావు, పిట్ట జయ, బంధం సుక్కమ్మ, బంధం జ్యోతి, సోడే చినమ్మి పెడకం వెంకటేశ్వరావు, మడకం దుర్గారావు, కుంజా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.