Amaravati: ముఖ్యమంత్రి చంద్రబాబు తో మున్నాభాయ్ భేటీ
Amaravati: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Amaravati: ముఖ్యమంత్రి చంద్రబాబు తో మున్నాభాయ్ భేటీ
Amaravati: బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి, పెట్టుబడులు, ఫిలిం ప్రొడక్షన్ అవకాశాలపై వీరిద్దరి మధ్య చర్చ సాగింది.
రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లు ఎక్కువగా జరగడానికి, ఫిలిం స్టూడియోలు, వర్క్‌షాప్‌లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమయ్యే అంశాలను ముఖ్యమంత్రి కి మున్నాభాయ్ వివరించారు. ముక్యంగా సినిమా రంగానికి మద్దతుగా ప్రభుత్వం తీసుకునే ముందస్తు ప్రణాళికలు, పెట్టుబడులను ఆకర్షించడానికి చేసే ఏర్పాట్లు, ఉద్యోగావకాశాలను సృష్టించడం వంటి కీలక అంశాలు వీరి భేటీలో చర్చకు వచ్చాయి.
రాష్ట్రంలో సినిమా పరిశ్రమను మరింత ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సెలవిచ్చారు సీఎం చంద్రబాబు.. ఫిలిం స్టూడియోలు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలను, పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన అవకాశాలను కల్పిస్తుందని స్పష్టం చేశారు.
ఏపీని సినిమా షూటింగ్ కేంద్రంగా తీసుకోవడం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలపై సంజయ్ దత్ ఆసక్తి చూపించారు. భవిష్యత్తులో పెట్టుబడులు, సినిమా ప్రొడక్షన్ ప్రాజెక్టులు పరిశీలించి, రాష్ట్రానికి మేలు చేసేందుకు ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి కి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని. కొత్త స్టూడియోలు, అధునాతన సౌకర్యాలు, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రం ఫిలిం పరిశ్రమకు స్నేహపూర్వక, ఆకర్షణీయమైన కేంద్రంగా మారనున్నదనీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు పెరగటంతో పాటు, పెట్టుబడిదారులకు కొత్త రాబడులు లభిస్తాయన్న నమ్మకం తో ప్రభుత్వం ఉందన్నారు ముఖ్యమంత్రి. ఈ సమావేశం ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రంగానికి కొత్త దిశ, పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించే కీలక వేదికగా నిలిచింది. భవిష్యత్తులో రాష్ట్రం సినిమాటిక్ హబ్‌గా మారే అవకాశాలను ఈ భేటీ స్పష్టంగా చూపుతోంది.