Veligonda: రిజల్ట్ లేకపోతే చర్యలు తప్పవు.. టన్నెల్ పనులపై మంత్రి సీరియస్
Veligonda: వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ లైనింగ్ పనుల్లో జాప్యంపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Veligonda: రిజల్ట్ లేకపోతే చర్యలు తప్పవు.. టన్నెల్ పనులపై మంత్రి సీరియస్
Veligonda: వెలిగొండ ప్రాజెక్ట్ టనెల్స్ లైనింగ్ పనులు టైమ్ షెడ్యూల్ ప్రకారం జరగకపోవడంతో అధికారుల తీరుపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వారం సమీక్షలు జరుపుతున్నా పరిస్థితిలో మార్పు లేదని, పనులు ముందుకు వెళ్ళడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు ఆలస్యానికి మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని స్పష్టం చేశారు. ఆలస్యానికి అధికారులు ఇచ్చిన సమాధానం తో మంత్రి సంతృప్తి చెందలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతివారం అమరావతికి వచ్చి వివరణ ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. అయినా కూడా పనిలో మెరుగుదల లేకపోయినా, నిర్ణీత సమయానికి పూర్తి చేయకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు ఇరిగేషన్ శాఖా అధికారులతో, సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత పనులను సమీక్షిస్తూ, ఆలస్య కారణాలను పరిశీలించారు. ప్రస్తుత పరిస్థితి ప్రకారం ప్రతిరోజు పనులు కొనసాగితే ప్రాజెక్ట్ టైమ్‌లైన్ కింద ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు.తదుపరి కార్యాచరణ, షెడ్యూల్‌లో మార్పులు అవసరమైతే వెంటనే అమలు చేయాలని సూచించారు.
వెలిగొండ ప్రాజెక్ట్ రాష్ట్రానికి, పంటలకు, పట్టణ ప్రాంతాలకు నీటి సరఫరా కోసం అత్యంత కీలక ప్రాజెక్ట్ గా ఉన్న విషయాన్ని అధికారులు మర్చిపోకూడదని గుర్తు చేశారు. సమయానికి పూర్తి చేయడం ద్వారా ప్రాజెక్ట్ ఫలితాలు, రైతుల పరిస్థితులు, పట్టణ ప్రాంతాల నీటి అవసరాలు అన్నీ సరిగా తీరతాయి అన్నారు..
రామానాయుడు సమీక్షా సమావేశంలో అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ టైమ్‌లైన్ కిందనే పూర్తయేలా కఠినంగా పర్యవేక్షణ చేయాలని హెచ్చరించారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు.. వచ్చేవారం పరిస్థితిలో మార్పు రాకపోతే హెచ్చరించిన చర్యలను అమలు చేస్తామని స్పష్టం చేశారు