Srisailam: మాడవీధుల్లో నిత్య కళారాధన.. శివనామ స్మరణతో పులకించిన క్షేత్రం

Srisailam: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న 'ధర్మపథం'లో భాగంగా నిత్య కళారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది.

Update: 2026-03-24 15:38 GMT

Srisailam: మాడవీధుల్లో నిత్య కళారాధన.. శివనామ స్మరణతో పులకించిన క్షేత్రం

Srisailam: శ్రీశైల దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా మంగళవారం అక్కిరాజు భజన బృందం, అంబేద్కర్ కోనసీమ వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

ఈ కార్యక్రమములో మహాగణపతి, మూషిక వాహన, మహాగణపతిం, శివశివ శంకరా, శంభో హరహర మహాదేవ, లింగాష్టకం, శ్రీశైలవాస, పార్వతి నాథుడా, శ్రీగిరి మల్లయ్య, పాతాళగంగమ్మ, కైలాసవాసమని మొదలైన పలు భక్తిగీతాలను, అష్టకాలను మొదలైన వాటిని శ్రీ అక్కిరాజు శ్రీనివాస కుమారు తదితరులు ఆలపించారు.

కాగా శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయిని శ్రీశైల దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు.

Tags:    

Similar News