Palakonda: అన్నదాతకు భరోసానిచ్చే కార్యాలయమే కూలిపోతే?

Palakonda: పాలకొండ పట్టణ నడిబొడ్డున ఉన్న సాగునీటి పారుదల శాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరింది.

Update: 2026-03-24 15:06 GMT

Palakonda: అన్నదాతకు భరోసానిచ్చే కార్యాలయమే కూలిపోతే?

Palakonda: పాలకొండ అన్నం పెట్టే అన్నదాత కు అత్యం కీలకమైన, అవసరమైన సాగు నీటిపారుదల శాఖ కార్యాలయం కూలిపోయేందుకు సిద్ధంగా దర్శనమిస్తుంది. పాలకొండ పట్టణ నడిబొడ్డులో రైతులందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యాలయాన్ని అప్పట్లో నిర్మించారు. దశాబ్దలకాలంగా రైతుల గోడు వింటున్న ఈ భవనాల ప్రస్తుత పరిస్థితి దయనీయంగా ఉంది.

రైతన్నకు సకాలంలో సాగునీరు అందకపోతే తమ బాధ, అవసరాలను వినిపించేందుకు నిరంతరం "నేనున్నానంటూ భరోసానిస్తున్న ఈ శిధిల గోడలు ప్రస్తుతం అగమ్యగోచరంగా కనిపిస్తున్నాయి. పోస్ట్ ఆఫీస్ రోడ్ లో ఈ కార్యాలయం విశాలమైన స్థలంలో నిర్మించబడి ఉంది.ప్రస్తుతం పిచ్చి మొక్కలు శిధిలమైన గోడలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. లోపలికి వెళ్లాలంటే బూత్ బంగ్లాను తలపిస్తోంది.

ఈ స్థలాల్లో మరుగుదొడ్లు వినియోగంతో పాటు, అసాంఘిక కార్యకలాపాలకు కూడా అడ్డగా మారినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. కార్యాలయానికి పోస్ట్ ఆఫీస్ రోడ్ లో ఉన్న గేటుకు కార్యాలయ సిబ్బంది నిరంతరం తాళాలు వేసుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కార్యాలయ సిబ్బంది కూడా ఆఫీస్ లోనికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి కనిపిస్తోంది భవనంలోని పై కప్పు పెచ్చులు ఊడి దర్శనమిస్తుంది. గోడలకు వేసిన సిమెంట్ పెచ్చులు పెచ్చులుగా ఊడి గోడలు కూడా కూలిపోయి దశలో ఉన్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్న ఇరిగేషన్ శాఖ కార్యాలయాన్ని ప్రజా ప్రతినిధులు,అధికారులు సందర్శించి నూతన భవనాలు నిర్మించి రైతన్నకు అండగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News