Amaravati: సీమలో మళ్లీ సేవా గంటలు.. ఆర్డీటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
Amaravati: ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో ఆర్డీటీ (RDT)కి విదేశీ నిధుల అడ్డంకులు తొలగిపోయాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చల అనంతరం FCRA క్లియరెన్స్ లభించింది.
Amaravati: సీమలో మళ్లీ సేవా గంటలు.. ఆర్డీటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాలుగా పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) సంస్థకు పెద్ద ఊరట లభించింది. విదేశీ నిధుల స్వీకరణలో ఎదురైన అడ్డంకులు తొలగడంతో సంస్థ కార్యకలాపాలు మళ్లీ వేగం పుంజుకోనున్నాయి. ఈ పరిణామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఆర్డీటీ ప్రతినిధి మాంచో ఫెర్రర్ ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) నిబంధనల కారణంగా కొంతకాలంగా ఆర్డీటీకి విదేశీ నిధుల ప్రవాహం నిలిచిపోయింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు ప్రభావితమయ్యాయి.
ఈ సమస్యను గుర్తించిన సీఎం చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పలుమార్లు చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఈ ప్రయత్నాల ఫలితంగా తాజాగా కేంద్రం నుంచి క్లియరెన్స్ రావడంతో ఆర్డీటీకి విదేశీ నిధులు అందే మార్గం సుగమమైంది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఆర్డీటీ వంటి సంస్థలు రాష్ట్రంలో పేదలకు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఇప్పుడు అడ్డంకులు తొలగడంతో పూర్వంలాగే సేవా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాయలసీమ సహా రాష్ట్రంలోని వేలాది గ్రామాల్లో విద్య, ఆరోగ్యం, జీవనోపాధి వంటి రంగాల్లో ఆర్డీటీ సేవలు అందిస్తోంది. తాజా పరిణామంతో ఆ సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.