Nellore: బోట్ల అదృశ్యం వెనుక ‘పచ్చ’ నేతలు.. పోలీసుల నిర్లక్ష్యంపై వైసీపీ ఆగ్రహం!
Nellore: నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్‌లో తమిళ బోట్ల తరలింపుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
Nellore: బోట్ల అదృశ్యం వెనుక ‘పచ్చ’ నేతలు.. పోలీసుల నిర్లక్ష్యంపై వైసీపీ ఆగ్రహం!
Nellore: జువ్వలదిన్నె హార్బర్ లో లంగరు వేసి ఉన్న తమిళ బోట్ల తరలింపులో దొంగలపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ, డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ప్రాణాలకు ఎదురొడ్డి తమిళ బోట్లను స్వాధీనం చేసుకొని ఒడ్డుకు చేర్చిన నెల్లూరు జిల్లా మత్స్యకారులకు, తెలియకుండా బోట్లను తరలించిన నేతలను ఎందుకు అరెస్టు చేయలేదంటూ.
ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఇవాళ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమిళ బోట్ల వ్యవహారం పై కాకాణి తీవ్ర స్థాయిలో స్పందించారు. జువ్వలదిన్నె బోట్లు చోరీకి గురైన నేపథ్యంలో కేసు నమోదైన నిందితుల పట్ల, ఎందుకు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బోట్ల తరలింపులో ఒక నాయకుడి ప్రమేయం ఉందంటూ. ఇప్పటికే మత్స్యకార పెద్దలు పదేపదే ఆరోపణలు చేస్తూ. కొన్ని ఆధారాలను బయటపెట్టిన అతనిని ఎందుకు అరెస్టు చేయలేదంటూ. ప్రభుత్వాన్ని కాకాణి గోవర్ధన్ రెడ్డి నిలదీశారు. తమిళ బోట్ల చోరీ వెనుక ఉండే, టిడిపి నేతలను ఎందుకు వదిలేశారో.. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
బోట్ల చోరీ విషయంలో మత్స్యకారులకు వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మత్స్యకార పెద్దలు డిమాండ్ చేస్తున్నట్లు, జువ్వలదిన్నె హార్బర్ నుంచి ఎత్తుకెళ్లిన తమిళనాడు ఓట్లను తిరిగి అక్కడికి చేర్చాలన్న డిమాండ్ కు తమ పార్టీ , మత్స్యకారులకు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. తమిళనాడుకు చెందిన బోట్లను తరలింపులో జరిగిన అన్యాయం పై మత్స్యకారులతో మాట్లాడేందుకు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి రావచ్చని, ఈ సందర్భంగా వాళ్ళతో మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు కాకాణి గోవర్ధన్ రెడ్డి సూచనప్రాయంగా వెల్లడించారు. బోట్లను తరలించిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోక పోవడం వెనుక అంతర్యం ఏమిటి అని కాకాణి ప్రశ్నించారు. తమిళనాడుకు చెందిన బోట్లను తరలించడంలో.. టిడిపి నేతల హస్తం ఉందని ఇప్పటికే పలుమార్లు మత్స్యకార పెద్దలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సి ఉందని కాకాణి అన్నారు.