Nellore: కన్నబిడ్డలపై కనికరం లేని తండ్రి.. ఏఎస్‌పేటలో వెలుగుచూసిన దారుణం!
Nellore: నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలో కసాయి తండ్రి ఘాతుకం. తన ఇద్దరు చిన్నారులపై వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన కుతుబ్ ఉద్దీన్.
Nellore: కన్నబిడ్డలపై కనికరం లేని తండ్రి.. ఏఎస్‌పేటలో వెలుగుచూసిన దారుణం!
నెల్లూరు జిల్లా: ఏఎస్‌పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కసాయి తండ్రి ప్రవర్తన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన కుతుబ్ ఉద్దీన్ అనే వ్యక్తి, భార్యతో విడిపోయి తన ఇద్దరు చిన్నారులను తీసుకుని ఏఎస్‌పేటకు వచ్చి నివసిస్తున్నాడు. ఇక్కడే బైక్ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.అయితే, ఈ క్రమంలో తన ఇద్దరు పిల్లలను తరచూ తీవ్రంగా కొడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తాజాగా పిల్లలిద్దరికీ ఒంటిపై వాతలు పెట్టి చికిత్స చేయించాడని సమాచారం. పిల్లల శరీరంపై ఉన్న గాయాలను గమనించిన ఇరుగుపొరుగువారు తీవ్రంగా చలించిపోయి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పిల్లలిద్దరిని ఐసిడిఎస్ సిబ్బందికి అప్పగించారు. అయితే చిన్నారులను ఇంత తీవ్రంగా హింసించిన తండ్రిపై ఇప్పటివరకు కఠిన చర్యలు తీసుకోలేదని స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.