జనసేనకి మరో షాక్

జనసేన పార్టీకీ మరో షాక్ తగిలింది. అ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మిత్రుడు అయిన రాజు రవితేజ పార్టీకి రాజీనామా చేశారు.

Update: 2019-12-13 15:58 GMT
janasena

జనసేన పార్టీకీ మరో షాక్ తగిలింది. అ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మిత్రుడు అయిన రాజు రవితేజ పార్టీకి రాజీనామా చేశారు. అయన రాజీనామాను ఆమోదిస్తునట్టు జనసేన కూడా అధికారకంగా ట్విట్టర్ వేదికగా స్పందించింది. "జనసేన పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీ రాజు రవితేజ గారు పార్టీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాం. ఆయన పార్టీ పట్ల వ్యక్తం చేసిన ఆవేదనను, అభిప్రాయాలను గౌరవిస్తున్నాము. గతంలో కూడా అయన ఇటువంటి బాధతోనే పార్టీని వీడి తిరిగి పార్టీలోకి వచ్చారు. ఆయనకు మంచి భవిష్యత్తు, ఆయన కుటుంబానికి శుభం కలుగ చేయాలని ఆ జగన్మాతను ప్రార్టిస్తున్నాను." అంటూ పేర్కొంది.



రాజు రవితేజ జనసేన పార్టీ మొదలు నుంచి ఆయన పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు. పార్టీ ఆవిర్భావ సమయంలో పవన్ కి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. పవనిజం పుస్తకాన్ని రాసింది కూడా ఆయనే. కానీ ఇప్పుడు పవన్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ రాజీనామా చేస్తూ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అందులో రాజు రవితేజ ఎం అన్నారో వర్డ్ టు వర్డ్ మీకోసం..

"శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారితో కానీ, జననేన పార్టీతో కానీ ఇకనుండి నాకు ఎటువంటి సంబంధం లేదని, ఉండబోదని, అందరూ గమనించాలని నేను కోరుతున్నాను. ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ మొదటి ప్రధాన కార్యదర్శి నేను. ప్రస్తుతం నేను పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిని, శ్రీ కల్యాణ్‌ గారి కోరిక మేరకు నేను ఈ పదవి ఇష్టం లేకపోయినా అంగీకరించాను. ఇకమీదట నేను శ్రీ కళ్యాణ్‌ గారితో కలిని పనిచేయను, అతనితో లేదా జననేన పార్టీతో సంబంధం కలిగి ఉండను. ఒకప్పుడు మంచి వ్యక్తి అయిన పవన్‌ కళ్యాణ్‌ గారు కక్షసాధంపుతనం మరియు కుల, మతపరమైన ద్వేషంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తిగా మారిపోయాడు. రాజకీయ లేదా సామాజిక శక్తి ఉన్న పదవిని ఆక్రమించటానికి అతన్ని అనుమతించకూడదు. శ్రీ కళ్యాణ్‌ గారు ఎటువంటి రాజకీయ అధికారానికి అర్హుడు కాడు. అర్హత లేకుండా పొందినది, అనుమతి లేకుండా వెళ్లిపోతుంది." అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.  




 


Tags:    

Similar News