Rajini: చంద్రబాబు ప్రచారయావ వల్లే ఘటన జరిగింది
Rajini: చీరల కోసం మహిళలు ప్రాణాలు తీసుకోరు
Rajini: చంద్రబాబు ప్రచారయావ వల్లే ఘటన జరిగింది
Rajini: గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుకల పంపణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిన సంఘటనపై మంత్రి విడదల రజని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రచార యావకి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు మంత్రి రజని. చంద్రబాబు నాయుడు ప్రచార యావకి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరమన్నారు. ఏదో చేసేస్తున్నట్లు, ప్రచార ఆర్భాటాలు చేశారని విమర్శించారు. గత పది రోజులుగా ఇక్కడేదో పంచుతున్నారని ఒక ఫేక్ ప్రచారాలు చేశారని చెప్పారు. మొన్న కందుకూరులో 8 మంది మరణించారు. ఇప్పుడు గుంటూరులో ముగ్గురు. ఈ చావులన్నింటికీ కూడా చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలని చంద్రబాబుపై మంత్రి విడదల రజని మండిపడ్డారు.