Raghurama Krishnamraju: బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన రఘురామకృష్ణరాజు

Raghurama Krishnamraju: ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Update: 2021-05-16 01:03 GMT

Raghu Rama Krishna Raju:(File Image)

Raghurama Krishnamraju: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు గుంటూరు సీఐడీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈనెల 28వ తేదీ వరకు ఆయనను రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ బెయిల్ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కులాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన రఘురామకృష్ణరాజుకు సీఐడీ స్పెషల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం తెలిసిందే. ఆయనపై ఐపీసీ 124-ఏ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు కొట్టారని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు ఆరోపించగా, అవి గాయాలు కాదని పోలీసుల తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు.

ఆయన కాళ్లపై గాయాలు ఉండటంతో ఎంపీని ఆస్పత్రికి తరలించారు. ముందుగా జీజీహెచ్‌కు తరలించగా, ఆ తర్వాత రమేష్‌ ఆస్పత్రికి తరలించాలని సూచించింది కోర్టు. ఆయన కోలుకునే వరకు ఆస్పత్రిలో ఉండవచ్చని తెలిపింది. ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్నంత వరకు ఆయనకు వై కేటగిరి భద్రత కొనసాగుతుందని, ఆయన శరీరంపై కనిపిస్తున్న గాయాలపై న్యాయస్థానం నివేదిక కోరింది. రెండు ఆస్పత్రుల్లో మెడికల్‌ పరీక్షలకు కోర్టు ఆదేశించింది.

ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో సీఐడీ కోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.. సీఐడీ విచారణలో కొందరు తనపై దాడి చేశారని నిందితుడు చెప్పారు. ఐదుగురు వ్యక్తులు రబ్బరు కర్రలతో దాడి చేసినట్లు తెలిపారు. తాళ్లతో కాళ్లు కట్టేసి దాడి చేసినట్లు రఘురామ తెలిపారు అని సీఐడీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. నిందితుడి గాయాలను తాను పరిశీలించాను అని అన్నారు.

Tags:    

Similar News