Guntur : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రొటోకాల్ రగడ

ఎమ్మెల్యే గల్లా మాధవికి సమాచారం లేకుండా ప్రభుత్వ కార్యక్రమం 24వ వార్డులో తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ అధికారుల తీరుపై ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్ర అసంతృప్తి ప్రభుత్వ కార్యక్రమానికి ఎమ్మెల్యే, ఎంపీలకు సమాచారం ఇవ్వరా అని ప్రశ్న ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం లేదు- ఎమ్మెల్యే మాధవి

Update: 2025-10-31 11:31 GMT

Guntur : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రొటోకాల్ రగడ

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రొటోకాల్ రగడ నెలకొంది. ఎమ్మెల్యే, ఎంపీలకు సమాచారం లేకుండా ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడంపై.. ఎమ్మెల్యే గల్లా మాధవి అసహనం వ్యక్తం చేశారు. 24వ వార్డులో తుఫాన్ బాధితులకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా.. ఫ్లెక్సీలో ఫొటోలు కూడా లేవు. దాంతో అధికారుల తీరుపై మాధవి ఆగ్రహించారు. దీని వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. ప్రజాప్రతనిధులు, అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తుందన్నారు. ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Full View


Tags:    

Similar News