పోసాని కృష్ణమురళికి ఊరట: బెయిల్ మంజూరు

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరైంది. కర్నూల్ జేఎఫ్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి పోసాని కృష్ణమురళి కర్నూల్ జిల్లా జైలులో ఉన్నారు

Update: 2025-03-11 13:43 GMT

పోసాని కృష్ణమురళికి ఊరట: బెయిల్ మంజూరు

పోసాని కృష్ణ మురళికి మంగళవారం బెయిల్ మంజూరైంది. కర్నూల్ జేఎఫ్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి పోసాని కృష్ణమురళి కర్నూల్ జిల్లా జైలులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసాని కృష్ణమురళిపై 2024 నవంబర్ 14న కేసు నమోదైంది.

ఆదోని త్రీటౌన్ లో జనసేన నాయకులు రేణువర్మ ఫిర్యాదుతో పోసానిపై బీఎన్ఎస్ 353 (1), 353 (2), 353 (సి) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరో వైపు విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ లో పోసానిపై నమోదైన కేసులో కూడా ఆయన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జనసేన నాయకులు బి. శంకర్ పోసానిపై ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.నరసరావుపేట రెండో పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోసాని కృష్ణమురళికి మార్చి 10న నర్సరావుపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ నాయకులు కొట్టా కిరణ్ ఫిర్యాదు మేరకు నరసరావుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆయనపై 14 కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే నాలుగు కేసుల్లో ఆయనకు కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26న అన్నమయ్య జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసులో పోసానిని అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News