Bestawaripeta: జేబీ కృష్ణాపురంలో కార్టన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

మండలంలోని జె.బి.కృష్ణాపురం గ్రామంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

Update: 2020-02-29 06:18 GMT
ఎస్ఐ షేక్. సమందర్ వలి, టి. త్యాగరాజు, సాంబశివరావు, ఎక్సైజ్ ఎస్ఐ పి. రాజేంద్రప్రసాద్

బేస్తవారిపేట: మండలంలోని జె.బి.కృష్ణాపురం గ్రామంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డెన్ సర్చ్ లో 26 కత్తులు, గుట్కా ప్యాకెట్లు, 4 ఫుల్ బాటిళ్ల మందు, పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నాటు సారాను అరికట్టే క్రమంలో భాగంగా, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఈ కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు గిద్దలూరు సిఐ సుధాకరరావు వెల్లడించారు.

ఈ కార్డెన్ సర్చ్ లో సీఐ సుధాకరరావు తోపాటు బేస్తవారిపేట ఎస్ఐ ఎస్.వి.రవీంద్రారెడ్డి, గిద్దలూరు ఎస్ఐ షేక్. సమందర్ వలి, రాచర్ల ఎస్ఐ టి. త్యాగరాజు, అర్దవీడు ఎస్ఐ సాంబశివరావు, ఎక్సైజ్ ఎస్ఐ పి. రాజేంద్రప్రసాద్, అటవీ శాఖ గార్డు నాయక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


Tags:    

Similar News