తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ
ప్రధాని హోదాలో తిరుమలకు నాలుగోసారి మోడీ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ
Tirumala: తిరుమల శ్రీవారిని ప్రధాని మోడీ దర్శించుకున్నారు. ప్రధాని హోదాలో ఆయన తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. ఆలయ మహాద్వారం వద్ద ప్రధానమంత్రికి ఇస్తికపాల్ స్వాగతం పలికిన అర్చకులు, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి దర్శనానంతరం.. రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు. ప్రధానికి టీటీడీ ఛైర్మన్, ఈవో...స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. ప్రధాని.. సుమారు 50 నిముషాల పాటు ఆలయంలో గడిపారు. షెడ్యూల్ సమయం కంటే అర్థగంట ముందుగానే శ్రీవారి దర్శనం ముగించుకుని అతిథిగృహం చేరుకున్నారు ప్రధాని మోడీ.