జిల్లాలు, డివిజన్ల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష

జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు.

Update: 2025-12-27 08:51 GMT

అమరావతి: జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతారాలను స్వీకరించింది. గడువు నేటితో ముగుస్తుంది.

ప్రాథమిక నోటిఫికేషన్‌ అనంతరం వ్యక్తమైన అభ్యంతారాలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. మార్పులు చేర్పుల తర్వాత డిసెంబర్ 31న ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది.

ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నారాయణ, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News