మంత్రి నారాయణ సమావేశంలో గుండెపోటుతో రైతు మృతి

అమరావతిలో రోడ్డు నిర్మాణ పనుల కోసం స్థలాలు కోల్పోతున్న రైతుల సమావేశంలో రైతు ఎం.రాములు(దొండపాటి రాములు) (68) గుండెపోటులో మృతి చెందాడు.

Update: 2025-12-26 14:38 GMT

అమరావతి: అమరావతిలో రోడ్డు నిర్మాణ పనుల కోసం స్థలాలు కోల్పోతున్న రైతుల సమావేశంలో రైతు ఎం.రాములు(దొండపాటి రాములు) (68) గుండెపోటులో మృతి చెందాడు. గుంటూరు జిల్లా మందడం గ్రామసభలో మంత్రి నారాయణ ముందే రాములు తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నాడు. ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే తమ గొంతు కోసినట్లు అవుతుందని చెప్పారు. మంత్రి నారాయణ చెప్పడం వల్లే తమకు వాగుల్లో ప్లాట్లు ఇచ్చారని రైతు రాములు ఆవేదన వ్యక్తం చేశారు.

వేణుగోపాలస్వామి గుడి తూర్పు పక్కన నివాసం ఉండే రాములు మాట్లాడుతూ, రోడ్డు కోసం ఇల్లు ఇవ్వడానికి అభ్యంతరం లేదని, అయితే, ఇల్లు కోల్పోయే వారు అందరికి మంచి చోట తాళ్లయపాలెం దగ్గరలో ఒకేచోట స్థలం ఇవ్వాలని రామారావు కోరారు. తమ అందరికీ సీడ్ యాక్సెస్ రోడ్ లో స్థలాలివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన కుర్చీలో కూర్చొని, ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆ సభలోని రైతులు వెంటనే అతనిని మణిపాల్ అస్పత్రికి తరలింంచారు. అయితే, రామారావు మార్గమధ్యలోనే మృతి చెందారు.

Similar News