Uravakonda: స్థానిక ఎన్నికల్లో తెదేపా జెండాను ఎగురవేద్దాం
రాష్ట్ర ప్రభుత్వం కోతల విధానాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లి తెదేపా జెండాను రెపరెపలాడిద్దామని చెప్పారు.
ఉరవకొండ: సాధారణ ఎన్నికల్లో మాదిరిగా అందరూ ఐక్యంగా పనిచేసి,స్థానిక సంస్థలు ఎన్నికల్లోనూ విజయం సాధించి రాష్ట్ర స్థాయిలోనే చరిత్ర సృష్టిద్దామని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెదేపా నియోజకవర్గ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఉరవకొండ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం కోతల విధానాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లి తెదేపా జెండాను రెపరెపలాడిద్దామని చెప్పారు. ప్రతిపక్ష స్థానంలో ఉండి అధికార పక్షాన్ని ఎదుర్కోవడం తమకు కొత్త కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దామని నియోజకవర్గ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.